దేవదాసి పాత్రలో అనసూయ

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ నటిగా కూడా రాణిస్తోంది. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ అందచందాల కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. యాత్ర సినిమాలో చేసింది ఒకటి రెండు సీన్లలో అయినా తన నటనానుభవం చూపించింది అనసూయ. ఆ తర్వాత అనసూయకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు కూడా వార్తలు వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నదని అన్నారు కానీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.
ఇక ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాండలో ఆమెకు ఒక రోల్ కన్ఫాం అయిందని గతంలో ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆ విషయాన్ని స్వయానా దర్శకుడే ప్రకటించాడంతో ఆ పాత్ర ఫిక్స్ అయినట్టే. అప్పట్లో కృష్ణ వంశీ షేర్ చేసిన పిక్ లో ఇందులో ఆమె చేతినిండా గాజులు, ఆభరణాలు ధరించి చీరలో దర్శనమిచ్చింది.అయితే ఆమె పోషించబోయే పాత్ర ఒక దేవదాసీ పాత్ర అని అంటున్నారు. జోగిణి, బసివిణి, దేవదాసి, మాతంగి.. ఇలా పేరు ఏదైనా జరిగేది ఏంటంటే బలహీన వర్గాలకు చెందిన ఓ బాలికను ఎంచుకుంటారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు రకరకాల ప్రలోభాలతో దేవుడికి జీవితాన్ని అంకితం ఇవ్వాలని చెప్పి దేవుడికి వదిలేలేపిస్తారు. ఆ పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేకపాటలో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందని అంటున్నారు.