ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ అంటూ స్పెషల్ ట్వీట్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ తన సినిమా విషయాలే కాక పర్సనల్ విషయాలని సోషల్ మీడియో వేదికగా నెటిజన్స్ తో షేర్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా తన ట్విట్టర్ లో ఇందిరా దేవికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు మహేష్. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి పుట్టిన రోజు నేడు. అందుకే ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు మహేష్.
నిజానికి మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో తండ్రి కృష్ణ, సవతి తల్లి విజయనిర్మల, మహేష్ బాబు సోదరుడు, సోదరీమణులు కనిపిస్తారు కానీ ఇందిర గారు కనిపించిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే మేన కోడలు అయిన ఇందిరతో పెళ్లి అయింది. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఇక మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ హీరోగా రాణిస్తున్నారు. అయితే విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణ బాగా చూసుకున్నారు.