నాకివ్వాలనిపించినప్పుడు ఇస్తా..మీరిమ్మంటే ఇవ్వాలా

మ్యాటర్ ఏదైనా గానీ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం శృతిహాసన్ ది. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. ఆమె ముక్కుసూటి తన వలన కొన్ని సినిమాలు ఆమెకు దూరమయ్యాయని చెప్పుకొంటారు. ఆ విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ నెటిజన్లకి షాకిచ్చింది. ఆమె నెటిజెన్స్ తో ముచ్చతిస్తున్న సమయంలో ఎవరో మహానుభావుడు ఇలా మాతో హస్క్ కొడుతూ కూర్చోక పోతే బయటకి వెళ్లి సమాజ సేవ చేయవచ్చు కదా, కరోనా రిలీఫ్ ఫండ్‌కి ఇంత వరకు విరాళం ఎందుకు ఇవ్వలేదు ఎంతో కొంత ఇవ్వవచ్చు కదా అని కామెంట్స్ చేశారు.
ఈ విషయం మీద తనదైన శైలిలో స్పందించింది శృతి. కరోనా విషయం మీద ప్రజలకి సేవ ఎందుకు చేయడం లేదని కొందరు తనకు కామెంట్స్ పెడుతున్నారని అన్నది. తనను సేవ చేయమని అడిగేవారు ఎంత సేవ చేస్తున్నారో తనకు తెలియదన్న ఆమె, ప్రభుత్వం మనల్ని ఇంట్లో ఉండమని ఆదేశాలు ఇచ్చిన విషయాలు మరచిపోకండని చెప్పుకొచ్చింది. ఇక విరాళం గురించి స్పందిస్తూ గతంలో నేను సాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్న ఆమె ఎవరో చెబితే తాను సాయం చేయనని చెప్పుకొచ్చింది. తనకి ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తానని ఆమె చెప్పుకొచ్చింది.