English   

మీ సంకల్పబలం అనితరసాధ్యం...హ్యాపీ బర్త్ డే బాబు గారూ.. చిరంజీవి

Chiranjeevi
2020-04-20 14:53:12

టైమ్ గ్యాప్ ఉండొచ్చు గానీ, టైమింగ్ లో నో గ్యాప్ అన్నట్లు దూసుకెళ్తున్నాడు చిరంజీవి. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన కుర్రాళ్ల కంటే దూకుడుగా ఉంటున్నాడు మెగాస్టార్. నిమిషానికో అప్డేట్, గంటకో పోస్ట్ అన్నట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు చిరు. చిరంజీవి ఉగాదినాడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో అకౌంట్స్ ఓపెన్ చేశాడు. క్వారెంటైన్ పీరియడ్‌లో అభిమానులకు టచ్‌లో ఉండడానికి సోషల్ మీడియా పర్సన్‌గా మారిపోయాడు. అయితే చిరంజీవి ఈ సోషల్ వరల్డ్‌లోకి కొంచెం లేట్‌గా వచ్చినా, లేటెస్ట్‌గా ఉంటున్నాడు. వరుస పోస్టులతో అభిమానులకు మెగా అప్డేట్స్ ఇస్తున్నాడు. 

అయితే ఈరోజు ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా మెగాస్టార్ ఒక ట్వీట్ చేశారు.  "అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం  ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. Wishing you a happy 70th Birthday Sir @ncbn  Your vision, your hard work, your dedication are exemplary " అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు గతంలో చంద్రబాబుతో ఒక వేడుక సందర్భంగా సరదాగా దిగిన ఒక ఫోటోను కూడా చిరు షేర్ చేశారు.

More Related Stories