ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలు ఇవే..

రీ ఎంట్రీలో మామూలుగా రచ్చ చేయడం లేదు మెగాస్టార్ చిరంజీవి. ఈయన దూకుడు చూసి కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. మరో ఐదేళ్ల వరకు కూడా ఈయన ప్రాజెక్ట్స్ అన్నీ సెట్ అయిపోయాయి అంటే చిరు దూకుడు ఎలా ఉందో అర్థమైపోతుంది. వచ్చే ఐదు సినిమాలను కూడా సెట్ చేసుకున్నాడు అన్నయ్య.
ఆచార్య: కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తయింది. రామ్ చరణ్ వచ్చి జాయిన్ అయితే మిగిలిన పార్ట్ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది
విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
సుజీత్: లూసీఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి చాలా రోజులుగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ బాధ్యతను సుజీత్‌కు అప్పగించాడు చిరు. తెలుగు వర్షన్లో చిరుకు హీరోయిన్ కూడా
ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.
బాబీ: జై లవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలతో స్టార్ హీరోలను తాను బాగానే హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్న బాబీ.. చిరంజీవి కోసం కథ సిద్ధం చేసాడు. ఈయనతో కూడా ఓ సినిమా
చేయబోతున్నాడు మెగాస్టార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. పూర్తిగా కామెడీ జోనర్లో ఈ సినిమా ఉండబోతుంది.
మెహర్ రమేష్: మెగా అభిమానులను కలవరపెడుతున్న కాంబినేషన్ ఇదే. మెహర్ రమేష్ చెప్పిన కథ తనకు నచ్చిందని చిరు చెప్పడంతో కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. అయితే మెహర్ సినిమా చేస్తాడా
లేదా అనేది చివరివరకు చూడాల్సిందే.
త్రివిక్రమ్: చాలా రోజుల కిందే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయింది. వినయ విధేయ రామ ఆడియో వేడుకలోనే త్రివిక్రమ్ సినిమా ప్రకటించాడు చిరంజీవి.
బోయపాటి శ్రీను: మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి కూడా చిరంజీవికి కథ చెప్పాడు. అయితే అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. కానీ మళ్లీ బాలయ్య సినిమా తర్వాత పట్టాలెక్కినా
ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
వీళ్ళతో పాటు పరశురామ్, హరీష్ శంకర్ లాంటి కుర్ర దర్శకులు చెప్పిన కథలు కూడా విన్నాడు మెగాస్టార్. మొత్తానికి వరస సినిమాలతో దుమ్ము దులిపేయాలని ఫిక్సైపోయాడు చిరంజీవి.