బాలయ్యతో కచ్చితంగా కొట్టి చూపిస్తానంటున్న పూరీ..

బాలయ్యకు ఓ అలవాటు ఉంది. ఓసారి తనకు నచ్చిన దర్శకులకు హిట్టు ఫ్లాపులు అని చూడకుండా ఆఫర్లు ఇస్తుంటాడు. అందులో పూరీ జగన్నాథ్ కూడా ఇప్పుడు చేరిపోయాడు. ఈయనతో త్వరలోనే బాలయ్య సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బద్రి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూరీ మాట్లాడుతూ బాలయ్యతో సినిమా పక్కా అంటున్నాడు. కచ్చితంగా మా కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని చెప్పాడు ఈయన. ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్న పూరీ.. ఈ లాక్ డౌన్ గ్యాప్ లో బాలయ్య కోసమే కథ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. టెంపర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయిన పూరీ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలనం సృష్టించాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఫైటర్ సినిమా హిట్టైతే మరో ఆఫర్ పూరీ చెంతకు వస్తుందని తెలుస్తుంది. అదే బాలయ్యతో సినిమా చేసే అవకాశం. గతంలోనే పైసా వసూల్ అంటే బాలయ్యతో ఓ సినిమా చేసాడు ఈయన. ఇది ఫ్లాప్ అయినా కూడా అప్పుడు పూరీతో బాండింగ్ కు పడిపోయాడు బాలయ్య. ఆయన టేకింగ్ కు ఫిదా అయిపోయాడు. దాంతో మరోసారి పూరీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అయితే దీనికి ఓ మెలిక కూడా పెట్టాడు. ఫైటర్ హిట్ అయితే కానీ బాలయ్యతో సినిమా అవకాశం రాదు. ఇప్పుడు ఈ కండీషన్ కు పడిపోయాడు పూరీ. కచ్చితంగా ఫైటర్ తో హిట్ కొట్టి బాలయ్యతో ఆఫర్ పట్టేస్తానంటున్నాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు బాలయ్య. మరి చూడాలిక.. తర్వాత ఏం జరగబోతుందో..?