English   

రజనీకాంత్ సినిమాలో గోపీచంద్...క్లారిటీ ఇచ్చేశాడు 

Gopichand
2020-04-21 10:09:50

హీరో గోపీచంద్ కెరీర్ కొన్నాళ్ళగా అస్సలు బాలేదు. అప్పుడెప్పుడో లౌక్య సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత అరడజను సినిమాలు చేసినా అవి వర్జౌట్ కాలేదు. ఈ మధ్యనే ఎన్నో ఆశలతో భారీ బడ్జెట్ పెట్టి చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో అయోమయంలో పడిన ఆయన ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన హాకీ కోచ్ గా కనిపించనున్నాడు. ఇక ఆయన తనకి అచ్చొచ్చిన పాత దర్శకుడితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ దర్శకుడు ఎవరో కాదు తేజ. దర్శకుడు తేజతో గోపీచంద్ అనుబంధం గురించి తెలిసిందే. 

అయితే నిజానికి రజనీకాంత్ హీరోగా “అన్నాత్తే” అనే పేరుతో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, ఒక కీలక పాత్ర కోసం గోపీచంద్ ఎంపిక అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అలాంటిది ఏదీ లేదని గోపీచంద్ క్లారిటీ ఇచ్చాడు. తాను రజనీకాంత్ మూవీ లో విలన్ గా నటించడమనే వార్త నిజం కాదని పేర్కొన్నాడు. దర్శకుడు శివ తనకు మంచి ఫ్రెండ్ అన్న ఆయన తమ ఇద్దరి కాంబినేషన్ లో ” శౌర్యం”, “శంఖం ” మూవీస్ వచ్చాయని అన్నాడు. అయితే అన్నాత్తే ” మూవీ తరువాత దర్శకుడు శివ తమ ఇద్దరి కాంబినేషన్ మూవీ కొరకు స్క్రిప్ట్ రెడీ చేయనున్నారని గోపీచంద్ పేర్కొన్నారు. బహుశా దాని కోసం కలిసినపుడు మన మీడియా చూసి ఈ వార్త పుట్టించి ఉండచ్చు.  

More Related Stories