English   

మహేష్ సరసన కీర్తి...ఖరారయినట్టే 

keerthy suresh
2020-04-21 10:37:37

ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. అయితే మళ్ళీ తన తదుపరి సినిమాని తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని ముందే క్లారిటీ ఇచ్చినా అది ఎందుకో కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ పరశురామ్ కాంబినేషన్ సినిమా ఒకటి తెర మీదకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మాత్రం తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జంటగా కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు. తాజాగా ఆ సినిమాలో బాలీవుడ్ భామ నటించబోతున్నట్లుగా ముందు ప్రచారం మొదలయింది. అయితే గతంలో కీర్తి సురేష్ నటిస్తారని ప్రచారం జరిగినా దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు అదే ప్రచారం మొదలయింది. ఇక పస్తుతం కీర్తి నటించిన 'గుడ్‌లక్‌ సఖి, మిస్‌ ఇండియా, పెంగ్విన్‌' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.  
 

More Related Stories