English   

కథ విని ఓకే చెప్పి...హీరో తెలిశాక వద్దందట 

kajal agarwal
2020-04-21 12:16:41

కాజల్ కి ఈ మధ్య కాలంలో కాలం అసలు కలిసి రావడం లేదు. అయితే ఆమెకి ఈ సంబందించిన ఒక వార్తా ఇప్పుడు సంచలనంగా మారింది. అదేంటంటే ఇలాంటి కష్ట కాలంలో కూడా ఆమె రిజెక్ట్ చేసిన సినిమా గురించి ఆమె వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమెకు తమిళ్ లో ఒక భారీ ఆఫర్ వచ్చిందట. ఆ తమిళ సినిమా కథ మొత్తం విని స్క్రిప్ట్ బాగా నచ్చి నటించడానికి ఒప్పేసుకుంది. అయితే ఆమెకు ఎప్పుడైతే సినిమాలో హీరో పేరు చెప్పారో వెంటనే ఆమె ఆ ప్రాజెక్టు నుంచి మరో ఆలోచన లేకుండా తప్పుకుందని అంటున్నారు. ఆ హీరో ఎవరంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయ్ నిధి స్టాలిన్. 

ఉదయనిధి స్టాలిన్ నటించిన ' ఓకే ఓకే ' సినిమా బానే ఆడింది. ఈ మధ్యనే సైకో అనే సినిమాను కూడా చేశాడు. అది పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ పర్లేదు. అయితే ఆమె ఇలా నో చెప్పడానికి కారణం కాజల్ కు ఉదయ్ కు అంతకు ముందు ఒక గొడవ జరిగిందట. నిజానికి ముందే ఉదయ్ కి చెందిన బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్ప్య్కుని చేయలేదు. దీంతో చలనచిత్ర మండలిలో ఉదయ్ ఫిర్యాడు చేయగా అతనికి ఆమె వద్ద నుండి 40 లక్షల రూపాయలు కూడా రీఫండ్ వచ్చాయి. అందుకే హీరో అతను అని తెలియగానే తప్పుకుందని అంటున్నారు.  

More Related Stories