English   

తల్లితండ్రులతో అనుష్క...వైరల్ అవుతోన్న ఫ్యామిలీ పిక్

Anushka Shetty
2020-04-21 12:59:25

కరోనా దెబ్బకు షూటింగ్‌ లు ఏవీ లేకపోవడంతో అందరూ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక స్వీటీ అనుష్క కూడా ఇంటికే పరిమితం అయింది. నిన్న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న పిక్ ని షేర్ చేసుకుంది. నిన్న తన తండ్రి విట్టల్ శెట్టి పుట్టిన రోజు కావడంతో ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇదే పిక్ లో అనుష్క తల్లి ప్రఫుల్లా కూడా ఉన్నారు. 

ఇక ఆ పిక్ పోస్ట్ చేసిన అనుష్క ‘మీరు మా కోసం ఎన్నో చేశారు. మమ్మల్ని ఆనందంగా ఉంచిన మీరు ఇలానే ప్రతి రోజు నవ్వుతూనే ఉండండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ.. ఆప్యాయంగా ప్రోత్సహించడాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ రోజు మీ రోజు. హ్యాపీ బర్త్ డే పప్పా’ అంటూ ఎమోషనల్ గా కామెంట్ చేసింది అనుష్క. అయితే అనుష్క పేరెంట్స్ ఇప్పటి దాకా జనానికి పరిచయం లేకపోవడంతో ఆ పిక్ వైరల్ అవుతోంది. 

ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ షూట్ అంతా రెడీ అయి రిలీజ్‌కి రెడీగా ఉంది. కరోనా దెబ్బ లేకుండా ఉంటే ‘నిశ్శబ్దం’ సినిమా ఈపాటికి థియేటర్స్‌లో సందడి చేసేది. ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటించగా.. హీరోయిన్లు అంజలి, శాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటుడు మ్యాడిన్సన్ విలన్‌గా నటించాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు.

More Related Stories