లూసిఫర్ రీమేక్ కి మార్పులు రెడీ...హీరోయిన్ కూడా

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. ఈ మూవీకి సంభందించిన ప్రతి న్యూస్ ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవి తన తదుపరి సినిమాలను ప్రకటించాడు. అందులో లూసిఫర్ రీమేక్ సాహో సుజీత్ చేస్తున్నట్టు ప్రకటించారు కూడా.
అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట కొచ్చాయి. తెలుగు వర్షన్లో చిరుకు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులన్నీ కలిపి దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. ఈ చిత్రానికి `సాహో` ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం లాక్డౌన్ పిరియేడ్కావడంతో సుజీత్ రెండు మూడు వర్షన్స్ రెడీ చేస్తున్నట్టు చెబుతున్నారు.