English   

ఎన్టీఆర్ ఛాలెంజ్‌ యాక్సెప్ట్ చేసిన చిరంజీవి..

Chiranjeevi
2020-04-21 13:55:15

లాక్ డౌన్ సమయంలో ఎవరి ఇంటి పనులు వాళ్లే చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మన హీరోలు ఛాలెంజ్ లు కూడా విసురుకుంటున్నారు. ఇంటి పనులు చేసి వీడియో పోస్ట్ చేయండి అంటూ బి ది రియల్ మ్యాన్ పేరుతో ఓ ఛాలెంజ్ రన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి, తారక్ లాంటి వాళ్లు చాలెంజ్ స్వీకరించారు. వాళ్లు మరొకర్ని కూడా నామినేట్ చేసారు. ఇందులో భాగంగానే చిరంజీవిని ఇంటి పనుల కోసం ఛాలెంజ్ చేసాడు జూనియర్. అందులో నాగార్జున, బాలయ్య, వెంకటేష్ కూడా ఉన్నారు. 

ఇప్పుడు చిరంజీవి ఈ ఛాలెంజ్ స్వీకరించాడు. పైగా తన సినిమా ఛాలెంజ్ పోస్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేసి యాక్సెప్టెడ్ అని పోస్ట్ చేసాడు మెగాస్టార్. ఇప్పటికే ఈయన ఇంటి పనులు చాలానే చేస్తున్నారు. తోట పనులు చేస్తూ వీడియోలు కూడా పోస్ట్ చేసారు. ఈ లాక్ డౌన్ సమయంలో తాను ఇదే పని చేస్తున్నానని చెప్పాడు కూడా. ఇక పార్ట్ నర్ ఇన్ క్రైమ్ రామ్ చరణ్ కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాడంటూ కొసమెరుపు ఇచ్చాడు చిరు. కొరటాల శివ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించాడు. ఆయన కూడా ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేస్తున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ తో ఈయన సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. 

More Related Stories