English   

చిరంజీవి నుంచి బాలయ్య వరకు ఎవర్నీ వదలని జూనియర్.. 

 Jr NTR
2020-04-21 16:15:11

టాలీవుడ్ లో ప్రస్తుతం ఛాలెంజ్ ల పరంపర నడుస్తుంది. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటి పనులు చేస్తూ ఆ ఛాలెంజ్ రాజమౌళికి విసిరాడు. ఆయన కూడా ఇంట్లో అన్ని పనులు చేసాడు. ఫ్లోర్ క్లీన్ చేయడం.. అంట్లు తోమడం.. తోట పని అన్నీ చేసాడు. ఆ తర్వాత ఆ ఛాలెంజ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, కీరవాణికి విసిరాడు. ఇందులో ఇప్పుడు తారక్ కూడా జక్కన్న ఇచ్చిన ఛాలెంజ్ పూర్తి చేసాడు. తాను కూడా కొందరికి మళ్లీ ఛాలెంజ్ చేసాడు. 

మెగాస్టార్ చిరంజీవి నుంచి బాబాయ్ బాలయ్య వరకు అందరికీ పనులు చేయాలని సవాల్ చేసాడు ఎన్టీఆర్. అందులో నాగార్జున, వెంకటేష్ కూడా ఉన్నారు. వాళ్లంతా కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించాలి అని కోరాడు జూనియర్. బీ ది రియల్ మెన్ అంటూ సాగుతున్న ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం.. అంటూ తారక్ విసిరిన ఈ ఛాలెంజ్ మన అగ్ర హీరోల్లో ఎవరు ముందు చేస్తారో చూడాలి. ఇప్పటికే చిరంజీవి అయితే ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు.. వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. 

More Related Stories