English   

మహేష్ బాబు క్వారంటైన్ టైమ్ అంతా సితారతోనే..

Mahesh
2020-04-21 18:02:16

టాలీవుడ్ లో ఫ్యామిలీ ఫస్ట్ సినిమాలు నెక్ట్స్ అనే హీరోలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అప్పటి హీరోల మాదిరి ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేయాలనే తొందర ఎవరిలోనూ కనిపించడం లేదు. పైగా దొరికిన టైమ్ కుటుంబంతోనే గడిపేస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఏకంగా హీరోలంతా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. తన క్వారంటైన్ టైమ్ అంతా కుటుంబానికే ఇచ్చేస్తున్నాడు ఈయన. మరీ ముఖ్యంగా కూతురు సితారతోనే తన ఆటపాటలన్నీ సాగిస్తున్నాడు సూపర్ స్టార్. 

హాయిగా ఈ హాలీడేస్ ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మరో రెండు నెలల వరకు కుటుంబంతోనే ఉండనున్నాడు ఈయన. ఎలాగూ షూటింగ్స్ లేవు కాబట్టి కుటుంబమే ప్రాణం అంటున్నాడు. ఎప్పటికప్పుడు సితారతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఈయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన కూతురు తన ప్రపంచం అంటున్నాడు ఈయన. ఇక ఇన్నేళ్ల జర్నీని చూస్తుంటే ఆనందంగా ఉందని.. అయితే ఈ ప్రయాణం తన ఒక్కడిది కాదనీ.. ఒక్కడైతే ఇంత దూరం రాలేనని చెప్పాడు సూపర్ స్టార్. తనకు తన కుటుంబమే బలమని ఎప్పుడు అడిగినా చెప్తాడు మహేష్. వాళ్లు లేకపోతే తాను లేనంటాడు. 

More Related Stories