English   

అలా ఇంట్లో వంట చేసుకుంటున్న ఎమ్మెల్యే రోజా..

roja
2020-04-22 07:18:48

ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే అంటారు. అలాగే ఎంత ఎమ్మెల్యే అయినా.. హీరోయిన్ అయినా కూడా ఇంట్లో మాత్రం సాధారణ గృహిణిలా మారిపోయింది రోజా. కొన్నేళ్లుగా టెలివిజన్ షోలు.. రాజకీయాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు పూర్తిగా కుటుంబంతో కాలం గడిపేస్తుంది. ఇన్ని రోజులు మిస్సయిన ఆనందం ఎప్పుడు పొందుతుంది ఈ సీనియర్ హీరోయిన్. హాయిగా తన పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు ఏం అడిగితే అది వండి పెడుతుంది. ఎలాగు బయటికి వెళ్ళేది లేకపోవడంతో హాయిగా పిల్లలు అడిగిన వంటలు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంది రోజా. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా రోజా వంట వీడియోలు దర్శనమిస్తున్నాయి. అప్పుడెప్పుడో ఒకసారి చికెన్ ఫ్రై చేసింది.. అది చూసి బండ్ల గణేష్ ఆమెకు థాంక్స్ కూడా చెప్పాడు. ఆ తర్వాత బీట్రూట్ చట్నీ, ఆవకాయ పచ్చడి, గుత్తి వంకాయ కూర.. ఇలా అభిమానులకు చాలా నేర్పించింది రోజా. మధ్యలో ఒకసారి పోలీసుల కోసం స్వయంగా వంటకాలు సిద్ధం చేసింది. ఇక ఇప్పుడు మరో సారి చికెన్ పచ్చడి ఇలా చేసుకుంటే యూట్యూబ్ లో వీడియో హల్ చల్ చేస్తుంది. మొత్తానికి ఎప్పుడూ రాజకీయాలతో టీవీ షోలతో బిజీగా ఉండే రోజాకు ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ అనుకోని సెలవులు ఇచ్చేసింది. దాంతో మళ్లీ ఒక్కసారిగా హౌస్ వైఫ్ అయిపోయింది రోజా.

More Related Stories