English   

వాళ్ళపై ఫైర్ అయిన చిరంజీవి.. మాట్లాడి టైం వేస్ట్ చేసుకోను..

chiru
2020-04-22 07:29:01

సాధారణంగా చిరంజీవి చాలా కామ్ గా ఉంటాడు.. కూల్ గా కనిపిస్తాడు. ఆయనకు ఎప్పుడో గాని కోపం రాదు. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు అస్సలు సహనం కోల్పోడు మెగాస్టార్. ఎప్పుడు ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనూ చాలా నిశ్చింతగా కనిపిస్తాడు చిరంజీవి. అలాంటి మెగాస్టార్ కు ఇప్పుడు కాస్త అసహనం వచ్చింది. అలా చేశారు కొందరు. ఈ మధ్య సోషల్ మీడియాలో చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇంట్లో చేసే తోట పనులు, వంట పనుల నుంచి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అంతేకాదు కుర్ర హీరోలతో కూడా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతున్నాడు.

ఇది చూసి కొందరు చిరంజీవిని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం మెగాస్టార్ వరకు వెళ్ళింది. ఈ మధ్య ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ కూడా ఇదే ప్రశ్న సూటిగా అడిగింది. సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్లకు మీరు ఏమి అని చెబుతారు చిరంజీవి గారు అని అడిగితే.. అలాంటి నీచ బుద్ది కలిగిన వాళ్ల గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకోను అని చెప్పాడు మెగాస్టార్. ట్రోలింగ్ అనేది నవ్వు తెప్పించేలా ఉండాలి కానీ నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు అంటూ ఆయన సీరియస్ అయ్యాడు. అలాంటి వాళ్ల గురించి మాట్లాడి అనవసరంగా వాళ్లను పెద్దది చేయడం నాకు ఇష్టం లేదు అంటూ మ్యాటర్ ముగించేశాడు మెగాస్టార్. ఏదేమైనా ట్రోలింగ్ విషయంలో చిరంజీవి బాగానే హర్ట్ అయ్యాడని అర్థమవుతుంది.

More Related Stories