English   

మహేష్ బాబుతో రాజమౌళి అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడట ..

rajamouli
2020-04-22 14:50:16

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో అభిమానులు చూడానుకుంటున్న కాంబినేషన్ రాజమౌళి, మహేష్ బాబు. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు దర్శక ధీరుడితో పని చేసారు కానీ మహేష్ బాబుకు మాత్రం ఈ అవకాశం రాలేదు. ఎప్పట్నుంచో ఆయన వేచి చూస్తున్నాడు కూడా. చాలా కాలం కింద కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది కానీ అది కుదర్లేదు. అయితే ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఆ తర్వాత వెంటనే మహేష్ బాబు సినిమా చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు ఈయన ప్రభాస్ తో మూడు.. ఎన్టీఆర్ తో మూడు.. చరణ్, నితిన్, సునీల్, నాని లాంటి హీరోలతో ఒక్కో సినిమా చేసాడు. పవన్, బన్నీ, మహేష్ లాంటి హీరోలతో రాజమౌళి పని చేయలేదు.

పవన్ కళ్యాణ్ తో తన సినిమా చేయలేను అని ఓపెన్ గానే చెప్పేసాడు రాజమౌళి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకి సిద్ధమవుతున్నాడు. అప్పట్లో మహేష్ బాబుతో సినిమా చేస్తే తాను జేమ్స్ బాండ్ కథ చేస్తానని చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు ఈ తరహా కథనే రాజమౌళి టీం సూపర్ స్టార్ కోసం సిద్ధం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మరో రెండు మూడు సినిమాలకు కూడా ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు. అయితే రాజమౌళి చేస్తానంటే ఆ సినిమాలను మహేష్ బాబు ఆపేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

More Related Stories