English   

సురేష్ ప్రొడక్షన్స్ నుండి మరో కొరియన్ రీమేక్...రెజీనా హీరోయిన్ ?

regina
2020-04-22 08:02:03

కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' చిత్రాన్ని తెలుగులో 'ఓ బేబీ'గా రీమేక్ చేసిన సురేష్ బాబు హిట్టు కొట్టిన సంగతి తెల్సిందే. ఆ సినిమా మంచి హిట్ కావడంతో నందిని రెడ్డితో మరో సినిమాను నిర్మించాలని సురేష్ బాబు ఫిక్స్ అయ్యాడని దానికి కూడా మరో కొరియన్ మూవీ రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారని ప్రకాహరం జరిగింది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఒక కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దమయ్యారని అన్నారు. ఆ రీమేక్ కు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె నో చెప్పిందిట. దీంతో ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే దానికి మళ్ళీ హీరోయిన్ ని మార్చారని అంటున్నారు. ట్యాలెంటెడ్ హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రలో సూపర్ హిట్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ ” తెలుగు భాషలో రీమేక్ కానుందని అంటున్నారు. ఈ సినిమాలో నివేత థామస్, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటించనున్నారని అంటున్నారు. అయితే ముందు నందినీ రెడ్డి అనుకున్నా ఇప్పుడు ఆమె బిజీ అయిపోవడంతో ఆమె ఈ సినిమా చేయడం లేదని అందుకే సుధీర్ వర్మ ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు.  

 

More Related Stories