English   

రిలీజ్ కాకుండానే తమిళ్ లోకి ఉప్పెన రీమేక్...కొన్నది ఆయనే 

Uppena
2020-04-22 10:59:10

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.  షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. రానుంది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు శానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇతర ప్రోమోలు కూడా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మంచి క్వాలిటీతో తీసినట్లుగా కనిపిస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ అమ్ముడు పోయాయయని అంటున్నారు. అదేంటి సినిమా రిలీజ్ కూడా కాకుండా రీమేక్ రైట్స్ అమ్ముడు పోవడం ఏమిటా ? అని ఆశ్చర్యపోకండి. ఈ సినిమాని కొన్నది మరెవరో కారు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విజయ్ సేతుపతి అని అంటున్నారు. . తెలుగు మూవీలో నటించిన పాత్రనే విజయ్ సేతుపతి తమిళ రీమేక్ లో కూడా నటించనున్నట్టు, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో ఈ మూవీని అక్కడి పేరున్న హీరోతో రూపొందించనున్నారని అంటున్నారు.  

More Related Stories