English   

నటిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. లక్షల సార్లు మల్లెపూలు పిసికావో 

 Sri reddy
2020-04-22 13:37:19

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్ళీ వార్తల్లో కెక్కింది. ఎప్పుడు ఎవర్నో ఒకరిని టార్గెట్ చేసి కామెంట్ చేయకుంటే ఆమెకి నిద్ర పట్టదేమో కానీ తాజాగా మన టాలీవుడ్ కి చెందిన ఒక నటిని ఉద్దేశించి పేరు చెప్పకుండా వార్నింగ్ ఇచ్చింది. నిజానికి తాజాగా యామిని సాధినేని గురించి నటి మాధవీ లతా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం తానున్న టీడీపీ ఓడిపోవడంతో యామిని బీజేపీ గూటికి చేరింది.  అయితే ఇప్పుడు ఆమెకి పార్టీలో కీలక పదవి ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో బీజేపీలో గత ఎన్నికల నాటికే పార్టీ లో చేరి గుంటూరు నుండి పోటీ చేసిన మాధవి లత ఆమె మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.

పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా నిన్న మొన్న పార్టీలో చేరేవారికి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని, పవన్ మల్లెపూల ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి ఇలా పదవులు ఇస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే మామూలుగానే పవన్ అంటే ఒంటి కాలి మీద లేచి వచ్చే శ్రీ రెడ్డి ఈ విషయంలో యామినిని వెనకేసుకు వచ్చింది. తను యామినిని సపోర్ట్ చేస్తానని, ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాత తీస్తా నని హెచ్చరించింది. అంతే కాదు, వాళ్ళ హిస్టరీ బయటకు తీస్తానని చెప్పుకొచ్చింది. నువ్వు ఎన్ని వేల సార్లు, సారీ సారీ లక్షల సార్లు మల్లెపూలు పిసికావో మర్చిపోయావా ? అంటూ ప్రశ్నించింది. అంతేకాక మన కులం వారికి ప్రేమ లేఖలు, మిగతా వాళ్ళను చూసి ఏడుపులు అంటూ ఇన్ డైరెక్ట్ గా ఎటాక్ చేసింది ఆమె. 

More Related Stories