English   

చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..

 Allu Arjun
2020-04-22 16:06:49

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ ఆచార్య తర్వాత మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు మెగాస్టార్. ఇందులో ఆచార్య తర్వాత వెంటనే లూసీఫర్ రీమేక్ తెలుగులో చేయబోతున్నాడు చిరు. ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యత సాహో దర్శకుడు సుజిత్ పై పెట్టాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటించగా.. మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలో కనిపించాడు. తెలుగులో ఆ పాత్ర కోసం అల్లు అర్జున్‌ని తీసుకున్నట్లు కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. దీనిపై బన్నీ కూడా స్పందించకపోవడంతో ఇది నిజమే అనుకున్నారు అభిమానులు కూడా. 

అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నాడని వస్తున్న వార్తలపై ఆయన పీఆర్ టీమ్ స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ తెలుగు రీమేక్ లో అల్లు అర్జున్ నటించడం లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని వాళ్లు కొట్టి పారేసినట్లు ప్రచారం జరుగుతుంది. లూసిఫర్ తెలుగు రీమేక్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఒక స్టార్ హీరోను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్. అది ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం కథను బాగానే మారుస్తున్నాడు సుజీత్. ఇక్కడ చిరంజీవి ఇమేజ్ కు తగినట్లు ఈ కథను చెక్కుతున్నాడు దర్శకుడు. వచ్చే జనవరిలో లూసిఫర్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. 

More Related Stories