English   

ఉప్పెన రీమేక్‌తో తమిళ హీరో విజయ్ కొడుకు అరంగేట్రం.. 

 Uppena
2020-04-22 17:35:15

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమా ఉప్పెన. ఎక్కువ జాతి అమ్మాయిని తక్కువ జాతి అబ్బాయి ప్రేమిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. కులాంతర వివాహం.. ఆపై హానర్ కిల్లింగ్ నేపథ్యంలో ఉప్పెన సినిమాను తెరకెక్కించాడు బుచ్చిబాబు. ఎప్రిల్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రానికి కరోనా కాటేసింది. త్వరలోనే మంచి విడుదల తేదీ చూసి విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు అప్పుడే తమిళనాట రీమేక్ కాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వైష్ణవ్ తేజ్ పరిచయం అయినట్లే.. అక్కడ కూడా ఓ స్టార్ హీరో కొడుకు ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. అతడే విజయ్ కొడుకు జాసన్ సంజయ్. 

ప్రస్తుతం ఈ కుర్రాడి వయసు 19 ఏళ్లు. ఇప్పటికే కెనడా వెళ్లి అక్కడ యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు సంజయ్. ఉప్పెన సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం విజయ్ తో మాస్టర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉప్పెన కథ గురించి విజయ్ తో సేతుపతి డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. ఇది సంజయ్ డెబ్యూ సినిమాకు సరిగ్గా సరిపోయే కథ అని విజయ్ కు విజయ్ సేతుపతి చెప్పడంతో ఆయన కూడా ఓకే అన్నాడని ప్రచారం జరుగుతుంది. ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రితో పాటు విలన్ పాత్ర కూడా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళనాట ఈ సినిమాను తానే నిర్మించాలని చూస్తున్నాడు విజయ్ సేతుపతి. 

More Related Stories