English   

ప్రభాస్ తో నాకు పెళ్ళా.. అదిరిపోయే రిప్లై ఇచ్చింది నిహారిక..

prabhas
2020-04-23 06:59:37

నిహారిక ఇప్పటి వరకు హీరోయిన్ గా సక్సెస్ కాలేదు కానీ గాసిప్స్ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయింది. మెగా కుటుంబంలో ఎవరిమీద రానన్ని వార్తలు ఈ ముద్దుగుమ్మపై వచ్చాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా హీరోలతో ఎఫైర్లు ఉన్నాయనే విషయంలో మాత్రం నిహారిక ను ఎప్పటికప్పుడు సోషల్ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఒకసారి నాగశౌర్యతో.. మరొకసారి సాయి ధరమ్ తేజ్ తో.. ఇంకోసారి ప్రభాస్ తో ఇక్కడ హీరోలు మారినా నిహారికపై వార్తలు మాత్రం ఆగవు. ఇప్పటికే సాయి తనకు అన్నయ్య ఇలాంటి వాడు అని చెప్పింది. నాగ శౌర్యతో ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ముచ్చట.. లాక్ డౌన్ కావడంతో కాసేపు అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో ముచ్చటించింది నిహారిక.

అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. కొందరు అభిమానులు కాస్త రిస్క్ చేసి బోల్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. దానికి ఏమాత్రం మొహమాట పడకుండా నిహారిక కూడా సమాధానం చెప్పింది. ప్రభాస్ తో మీరు ప్రేమలో ఉన్నారంట కదా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంట కదా అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నిహారిక అదిరిపోయే అన్సర్ ఇచ్చింది. తనకు ప్రభాస్ తో పెళ్లి ఏంటి.. ఆయన ఎక్కడ నేనెక్కడ అంటూ అసలు నిజం ఒప్పుకుంది నిహారిక. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు అంటే చెప్పుకొచ్చింది. వీటితో పాటు తన పెళ్లి గురించి కూడా చెప్పింది. సమయం వస్తే ఏది ఆగదని వేదాంతం చెబుతోంది నిహారిక.

More Related Stories