పుష్పలో మరో హీరోయిన్...ఏం రోల్ అంటే

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పుష్ప అనే పేరు ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులలో ఒక రకమైన అంచనా పెంచేశాయి. ఈ సినిమా బన్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు ప్రముఖులని ఎంపిక చేశారు. విలన్స్ విషయంలో పలు ప్రచారాలు జరుగుతున్నా ఇంకా ఫైనల్ ఎవరినీ చేయలేదు ఇక ఈ మధ్య పుష్ప సినిమాలో బన్నీ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తాడనే ప్రచారం మొదలయింది. ఒకటి రగడ్ లుక్, మరొకటి స్టైలిష్ లుక్ అని తెలుస్తోంది.
ఈ మూవీలో బన్ని మాఫియా డాన్ అని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రమే రగడ్ లుక్‌లో ఉంటాడని, మిగిలిన పోర్షన్లో స్టైలిష్‌గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఆ విషయాలు ఎలా ఉన్నా ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికయింది. అయితే తాజాగా మరో హీరోయిన్ గా నివేదా థామస్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఆమె పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఈ సినిమాలో సిన్సియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఆమె పాత్ర కారణంగానే హీరో అడవిలోకి అడుగుపెడతాడని అంటున్నారు.