English   

మేజర్ మీదనే ఆశలు పెట్టుకున్న తెలుగమ్మాయి

 Sobhita Dhulipala
2020-04-23 13:31:36

తెలుగింటి ఆడపడుచు శోభితా ధూళిపాళ ప్రతిభ కేవలం టాలివుడ్ కే పరిమితం కాలేదు. అటు వెబ్ సిరీస్, బాలివుడ్ సినిమాలు, యాడ్ ఫిల్మ్‌లలో తన ప్రతిభను చాటుకుంటూ బాలీవుడ్ దాకా చేరింది. ఒక రకంగా ఆమె తెలుగు సినిమాలు చేసింది ఒకటి రెండే అయినా బాలీవుడ్ వాళ్ళకి బాగా దగ్గరయ్యింది ఈ భామ. గూఢచారి సినిమాలో తళుక్కున మెరిసిన ఈ భామ 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఇక శోభిత ప్రస్తుతం సినిమాలతో.. వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంది. నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్న మలయాళ-హిందీ ద్విభాషా చిత్రం 'మూతోన్' లో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె మరో మలయాళ సినిమా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నా దాని మీద క్లారిటీ లేదు. 

ఇక అడివి శేష్  హీరోగా రూపొందుతున్న మేజర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది శోభిత థూళిపాళ్ళ. ఈ సినిమాలో  ఆమె పాత్ర చాలా కీలకమైనదని సమాచారం. చాలా ఎమోషనల్ గా సాగే ఈ పాత్ర సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె ఇంతవరకూ చేయని పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఇది తన కెరియర్ లో  చెప్పుకోదగిన పాత్ర అవుతుందనీ ఆమె నమ్ముతోందట. ఈ ఒక్క సినిమా తెలుగు నుంచి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ఇక మరోపక్క గూడచారి సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో కూడా గూడచారి టీమ్ ఉంది. అదే నిజం అయితే ఆ సినిమాలో కూడా ఈమె నటించే అవకాశం ఉంది. 

More Related Stories