English   

హమ్మయ్య సమంతా ఈజ్ బ్యాక్ 

 samantha
2020-04-23 13:50:45

తెలుగులోనే కాక దక్షిణాది బాషలన్నిటిలో టాప్ రేసులో దూసుకుపోతున్న హీరోయిన్లలో సమంత ఒకరు. అక్కినేని కోడలయ్యాక కాస్త గ్లామరస్ పాత్రలు ఆపేసిన ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలలపై దృష్టి పెట్టి నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తాజాగా జాను అని తమిళ ‘96’ తెలుగు రీమేక్‌ తో ముంచుకు వచ్చిన ఆమె ఆ సినిమా తప్ప మరే సినిమా ప్రకటించలేదు. ఆమె ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌ లో నటింస్తున్నారని ఒక అప్డేట్ అప్పట్లో ఇచ్చింది. 

ఇక ఆమె ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. మరి ఎందుకో ఏమో ఈ మధ్య దానికి ఆమె దూరం అయింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న పాపానికి ఆమె గురించి ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సామ్ సైలెంట్ అయిందంటే ఏదో ఉందని కొందరు గట్టిగానే నమ్మారు. మరికొందరు ఏమో సమంత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుందని పుకారు పుట్టించారు. 

అయితే ఇప్పుడు ఆ రూమర్లకు కాస్త బ్రేక్ వేసి చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది ఆమె. తన కుక్కని హగ్ చేసుకొని పడుకున్న ఒక ఫొటో ను పోస్ట్ చేస్తూ.. లాంగ్ స్లీప్ తర్వాత వచ్చా.. స్టే హోమ్, స్టే సేఫ్..అంటూ పోస్ట్ చేసింది. ఇక ఆమె అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో వెంటనే తన అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. చూద్దాం మళ్ళీ సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తుందో లేక ఇలానే కంటిన్యూ చేస్తుందో ?

More Related Stories