English   

కేటీఆర్‌ కి ఛాలెంజ్ విసిరిన చిరంజీవి 

Chiranjeevi
2020-04-23 14:08:16

ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుండి చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న మెగాస్టార్ చిరంజీవి నిన్న ఎన్టీఆర్ చేసిన బీ ద రియల్ మ్యాన్ స‌వాల్‌ని స్వీక‌రిస్తున్నట్టు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. త‌ను న‌టించిన ఛాలెంజ్ సినిమాలోని ఇట్స్ మై ఛాలెంజ్ అనే క్లిప్‌ని జ‌త చేస్తూ.. తార‌క్, నీ స‌వాలు స్వీక‌రించాన‌ని పేర్కొన్నారు. అన్నట్టుగానే ఈరోజు ఆయన దానికి సంబందించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ముందుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనుషులు రాక పోవడంతో ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని చెబుతూ సందీప్ రెడ్డి  ఓ వీడియోను షేర్ చేస్తూ రాజమౌళికి  మొదటగా ‘బి ది రియల్ మెన్  ఛాలెంజ్’  విసిరాడు. అక్కడి మొదలయిన ఈ ఛాలెంజ్ రాజమౌళి టు ఎన్టీఆర్, ఎన్టీర్ టు చిరంజీవికి చేరింది. తాజాగా చిరంజీవి కూడా ఇంటిని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసి..తన తల్లి గారైన అంజనమ్మకు ఇంట్లో దోశలు వేసి పెట్టి కొడుకుగా తల్లిపై తన ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు బి ది రియల్ మెన్ ఛాలెంజ్‌ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చిరంజీవి నామినేట్  చేసారు.

More Related Stories