English   

మహేష్ బాబుని ఛాలెంజ్ చేసిన వెంకటేష్ 

Venkatesh
2020-04-23 14:38:20

ఇల్లు ఊడ్చి, గిన్నెలు కడిగి వంట వండటం లాంటి పనులు ఎప్పుడూ మహిళలే చేయాలా?? అనే థాట్ నుండే పుట్టిండ్ ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్. నిజానికి ఈ పనులు పురుషులు కూడా చేస్తుంటారు కాని అది అరకొరగానే. అయితే ఇలాంటి పనుల్ని ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలతో చేయిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉన్న భర్తలు తమ భార్యలకు సాయం చేయాలనే అతనే రియల్ మ్యాన్ అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో ఒక్కొక్కరుగా భాగం అవుతున్నారు. 

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, చిరంజీవి ఇలా స్టార్ హీరోలు దర్శకులు ఇంట్లో వాళ్ల భార్యలకు సాయం చేస్తూ వీడియోలను విడుదల చేసి వాళ్లు కూడా మరికొంత మందిని నామినేట్ చేస్తున్నారు. అది అలా అలా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వద్దకి చేరింది. మనోడికి తారక్ ఈ ఛాలెంజ్ విసరగా తారక్ నా ఛాలెంజ్ ని పూర్తి చేశాను అంటూ తన వీడియోని పోస్ట్ చేసిన వెంకటేష్, మళ్ళీ ఆ ఛాలెంజ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు విసిరారు. ఇక ఈ ఛాలెంజ్ ని చిన్నోడు మహేష్, కోబ్రదర్ వరుణ్, దైరేకతర్ అనిల్ ఎలా స్వీకరించి పూర్తి చేస్తారో చూడాలి. 

More Related Stories