మరో లెజెండరీ నటి బయోపిక్‌లో కీర్తి సురేష్..

మహానటి సినిమాతో సావిత్రి పాత్రకు మళ్లీ ప్రాణం పోసింది కీర్తి సురేష్. అప్పటి వరకు నేను శైలజ, నేను లోకల్ లాంటి సినిమాల్లో సదరు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకుంది. తాను అందర్లాంటి హీరోయిన్ కాదని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. మహానటితో ఈమె క్రేజ్ ఆకాశానికి వెళ్లింది. అందులో సావిత్రి అమ్మలా అచ్చంగా నటించి ఆమెను గుర్తు చేసింది ఈమె. దాంతో కీర్తిసురేష్ అంటే ఇది నిరూపించుకుంది ఈ భామ. ఈ సినిమాతో గౌరవాన్ని కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. తెలుగులో ఈ చిత్రం తర్వాత సినిమాలేవీ చేయకపోయినా కూడా ఇప్పటికీ కీర్తిని మోడ్రన్ మహానటిగానే చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇలాంటి టైమ్ లో కేవలం కమర్షియల్ సినిమాల్లో బొమ్మలా నిలబడే హీరోయిన్ పాత్రలు చేసి తాను ఇమేజ్ చెడగొట్టుకోలేనని చెబుతుంది కీర్తి. అందుకే అందర్లాంటి హీరోయిన్ పాత్రలు చేయనంటుంది. మహానటి తర్వాత సామి 2తో పాటు పందెంకోడి 2, సర్కార్ లాంటి సినిమాల్లో అక్కడక్కడ కనిపించే పాత్రలే చేసింది.
కానీ ఇప్పుడు మాత్రం కథకు కీలకమైన పాత్ర అయితేనే చేస్తానంటుంది కీర్తి. ప్రస్తుతం మిస్ ఇండియాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి మన దగ్గర కేవలం నటనే కానీ అందాల ఆరబోత లేదమ్మా అంటుంది కీర్తి. ఎక్స్ పోజింగ్ చేయకపోయినా కూడా కీర్తి మాత్రం కీర్తి బాగానే సంపాదించుకుంటుంది. ఇలాంటి సమయంలో మరో బయోపిక్‌లో కీర్తి నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ నిర్మల బయోపిక్ చేయాలని ఆమె తనయుడు నరేష్ భావిస్తున్నాడు. అందులో కీర్తి అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ బయోపిక్ చర్చల దశలో ఉంది.