English   

మళ్ళీ ఆ స్టార్ హీరోతో శ్రుతి ?

sruthi
2020-04-24 08:28:19

రెండేళ్ల క్రితం శృతిహాసన్ ప్రేమలో పడి ఛాన్సులకు దూరమైంది. అటు ప్రియుడా? ఇటు కెరీరా? అని ఊగిసలాడిన శృతిహాసన్ మళ్లీ కెరీర్‌ మీదనే దృష్టి పెట్టింది. బ్రేకప్ తర్వాత రీ ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. లవ్ బ్రేకప్ తర్వాత శృతిహాసన్ తెలుగులో కంటే ముందుగా తమిళంలో బంపర్ ఆఫర్ సంపాదించిందని చెప్పచ్చు. ఎందుకనే అక్కడ ఫాంలో ఉన్న విజయ్‌ సేతుపతి సరసన లాభం అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఆఫర్స్ కాస్త లేటైనా ఎట్టకేలకు  క్రాక్‌ మూవీలో రవితేజాతో నటించే అవకాశం అందుకుంది శృతి. బలుపు హిట్‌ తర్వాత రవితేజ, శృతితో పాటు.. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే చాలా మంది కొత్త భామల ఎంట్రీతో శృతిహాసన్‌కు గతంలో మాదిరి ఆఫర్స్‌ వెల్లువెత్తకకపోయినా ఆమెతో ఒకసారి నటించిన హీరోలే మళ్లీ మళ్లీ ఛాన్సులిస్తున్నారు. వకీల్‌ సాబ్‌లో గెస్ట్‌ రోల్‌ ఆఫర్‌ వచ్చిందన్న ప్రచారం జరిగినా అది నిజం కాదని ఆమే తేల్చేసింది. తాజాగా ఆమె త్రివిక్రమ్‌ సినిమాలో తారక్‌ హీరోయిన్‌గా శృతి పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్ శృతిహాసన్‌ కాంబినేషన్‌లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా వచ్చింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం... నిరాశపరిచింది. అయితే.. తారక్‌, శృతి మధ్య కెమిస్ట్రీ పండింది. ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్‌ అవుతుందని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

More Related Stories