English   

ఆ సినిమాని చెడకొట్టకుండా సుజీత్ ప్రయత్నాలు 

 Sujeeth
2020-04-24 11:52:44

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేతయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట కొచ్చాయి. తెలుగు వర్షన్‌లో చిరుకు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. 

ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులన్నీ కలిపి దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. నిజానికి ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. ఆ సినిమాలో ఆయన రోల్ నే ఇప్పుడు చిరు పోషిస్తున్నారు. ఒరిజినల్ సినిమాలో అయితే ఆ పాత్రకు హీరోయిన్ ఉండదు. మరి అదే రోల్ ఇక్కడ చిరంజీవి చేస్తుండగా ఆయన సరసన హీరోయిన్ లేకుండానే చేస్తే ఎలా ఉంటుదనే ఆలోచన కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు. చిరంజీవి హీరో కాబట్టి హీరోయిన్ పెట్టాల్సిన అవసరం ఉందనే వాదన అక్కర్లేదని ఎలానూ ఒరిజినల్ వర్షన్ క్లైమాక్స్ లో వచ్చే ఐటెం సాంగ్ తో పాటు మరో సాంగ్ కూడా ఇరికించే ప్రయత్నం చేయచ్చని అంటున్నారు.  

More Related Stories