కరోనా కాలంలో వర్కౌట్స్..ప్రభాస్ ట్రైనర్ సూచనలు

ప్రస్తుతం కరోన వలన ప్రపంచ దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్ళాయి. ఒకరకంగా అత్యవసర సర్వీసుల వారు తప్ప మిగతా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఇలా పరిమితం కావడంతో ఎవరూ జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇలా చేయకపోతే ఇప్పటిదాకా చేసిన వాటికి అర్ధం లేకుండా పోతుంది. అందుకే అలాంటి వారి కోసం ప్రభాస్, అనుష్క శెట్టి, రాజమౌళికి ఫిట్నెస్ ట్రైనర్ అయిన కిరణ్ దేంబ్లా కొన్ని ఫిట్నెస్ టిప్స్‌ని తెలియజేశారు. ఈ ఇంట్లోనే ఉండి ఎలాంటి వర్కవుట్స్ చేయవచ్చో ఒక ఛానెల్ కి ఇచ్చిన స్పెషల్ వీడియోలో చేసి చూపించారు. క్వారెంటైన్ లో డైట్, వర్కవుట్ చేయకపోతే.. బరువు పెరిగిపోతామని, లావైపోతామని చెప్పిన ఆమె ఇంట్లో చేసే బేసిక్స్ కొన్ని చెప్పుకొచ్చింది.
ఆమె చెప్పిన టిప్స్ :
ఇంట్లో ఉన్న మెట్లు ఎక్కిదిగడం.
చెయిర్ పై కార్దియో.
ఇంట్లో 'యాబ్స్' చేయడం ఎలా.
ఇంట్లో కూర్చొని తుడవడం ద్వారా 'లోయర్ పార్ట్'కు మంచి ఎక్స్‌ర్‌సైజ్ లభిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.