మనమ్మాయేగా.. చౌదరి గారి పిల్లను పట్టించుకోండయ్యా..

చాందిని చౌదరి.. ఈ పేరు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ షార్ట్ ఫిల్మ్స్ తో పరిచయం ఉన్న వాళ్లకు మాత్రం చాందిని పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే అందులో ఆమె తోపు. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటిస్తేనే కొందరు హీరోయిన్లకు గుర్తింపు రాదు. కానీ షార్ట్ ఫిల్మ్స్ తోనే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది చాందిని చౌదరి. ఓ విధంగా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్ కు రారాణి. ఒకప్పుడు ఏడాదికి కనీసం పది షార్ట్ ఫిల్మ్ చేసేది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తెలుగమ్మాయిలను తెలుగులో పట్టించుకోరనే నానుడి మరోసారి చాందిని విషయంలోనూ ప్రూవ్ అయింది.
ఈ విషయంపై చాందిని కూడా ఇదే చెప్పింది. తాను తెలుగమ్మాయిని కావడం వల్లే తనకు అవకాశాలు రావట్లేదని ఓపెన్ గానే చెప్పేసింది ఈ భామ. అన్నట్లుగానే ఇక్కడ ఏ హీరో కరుణించడం లేదు ఈ పాపను. దాంతో వచ్చిన ఆఫర్లనే వాడేసుకుంటుంది చౌదరి గారమ్మాయి. ఈ మధ్య హౌరా బ్రిడ్జ్, మను లాంటి సినమాలు చేసినా కూడా ఈమెకు కాలం కలిసిరాలేదు. అందుకే బయటికి ఎక్కడికి వచ్చినా కూడా హాట్ హాట్ గా దర్శనమిస్తుంది చాందిని. నడుమొంపులతో కాక పుట్టిస్తుంది ఈ బెజవాడ బ్యూటీ. తన హాట్ షోతో మతులు పోగొట్టేస్తుంది ఈ భామ. చాందిని తీరు చూస్తుంటే సినిమాల్లో రెచ్చిపోవడానికి రెడీ అని సిగ్నల్స్ ఇస్తున్నట్లుంది. చూడాలిక.. ఈ అందాల ఆరబోత చూసిన తర్వాతైనా చౌదరి గారమ్మాయికి ఏ దర్శకుడైనా అవకాశం ఇస్తాడో లేదో..?