చిరంజీవి సంచలన నిర్ణయం.. కెరీర్లో తొలిసారి అలా..

రీ ఎంట్రీలో వరస సినిమాలతో రెచ్చిపోతున్న చిరంజీవి త్వరలోనే లూసీఫర్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు. ఆచార్య పూర్తి కాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను తెలుగులో దించేసే పని మొదలు పెడతాడు చిరంజీవి. ఈ సినిమాకు దర్శకుడిగా సాహో సినిమాను తెరకెక్కించిన కుర్ర దర్శకుడు సుజీత్ ను తీసుకున్నాడు చిరంజీవి. ఆయనపై పెద్ద బాధ్యతే పెట్టాడు మెగాస్టార్. లూసీఫర్ పూర్తిగా పొలిటికల్ డ్రామా.. ఆ సినిమాలో మోహన్ లాల్ పాత్ర కూడా చాలా హూందాగా, బరువుగా ఉంటుంది. అలాంటి పాత్రకు కమర్షియల్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ సరిపోతాడా అనే వాదన కూడా ఉన్నా.. ఆయన ఏ పాత్రకైనా ఇట్టే సూట్ అవుతాడని అభిమానులు చెబుతున్నారు. చిరంజీవిను ఎవ్వరూ అనుమానించడం లేదు కానీ సుజీత్ విషయంలో కంగారు తప్పట్లేదు.
ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ పై మరో సంచలన విషయం కూడా బయటికి వచ్చింది. ఒరిజినల్ సినిమాలో మోహన్ లాల్ కు హీరోయిన్ ఉండదు.. కామెడీ ఉండదు. ఇప్పుడు తెలుగులో కూడా చిరంజీవికి ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని తెలుస్తుంది. తెలుగు వర్షన్ కోసం కాస్త కమర్షియల్ హంగులు అద్దుతున్నా కూడా మరీ హీరోయిన్ ను పెట్టేసేంత కథ మాత్రం మార్చడం లేదని తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ ఈ సినిమాలో కానీ చిరంజీవికి హీరోయిన్ లేకపోతే ఇన్నేళ్ల కెరీర్ లో తొలిసారి హీరోయిన్ లేని మెగా సినిమాను చూడాల్సి వస్తుంది.