English   

నక్సలైట్ పాత్రలో ప్రియమణి

priyamani
2020-04-24 21:24:25

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకునున్నాడని కూడా ప్రచారం జరిగింది. సాయి పల్లవి పాత్ర ఏమో జానపద గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచే యువతిగా ఉంటుందట. ఇక భువనగిరిలో అత్యంత దారుణ హత్య కు గురైన బెల్లి లలిత పాత్రని పోలిన పాత్రలో ప్రియమణి నటిస్తోందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో ట‌బుని మాన‌వ హ‌క్కుల కోసం పోరాడే జర్నలిస్ట్ పాత్ర కోసం తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించినా `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా కోసం ఈ సినిమాని వదులుకుంది. అయితే ఆమె స్థానంలో బాలీవుడ్ న‌టి నందితాదాస్‌ ని అప్పుడే తీసుకున్నారు. ఆమెతో పాటు నటి ఈశ్వరి రావు, బాలీవుడ్ అలనాటి నటి జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ గాయని మావోయిస్టు నుండి గాయనిగా మారి నయీమ్ అనే గ్యాంగ్ స్టర్ చేతిలో హత్య చేయబడింది. ఆమెను ఎంతో క్రూరంగా చంపారు నయీమ్ గ్యాంగ్. చూడాలి ఈ సినిమా ఎలా ఉండనుందో ?

 

More Related Stories