English   

వైయస్ జగన్ కు మరో సారి జై కొట్టిన చిరంజీవి..

chiru
2020-04-25 07:09:03

రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెబుతూనే రాజకీయ నాయకులకు జై కొడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని తీరుకు ఫిదా అయిపోతున్నాడు. ఇప్పటికే రెండు మూడు సార్లు ఏపీ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి ఇప్పుడు ఇదే పని చేశాడు. వైయస్ జగన్ పనితీరు తనకు చాలా సంతృప్తికరంగా ఉందని.. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని చెప్పాడు. అంతేకాకుండా మూడు రాజధానుల కాన్సెప్టు తనకు బాగా నచ్చిందని.. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను సపోర్ట్ చేశానని చెప్పాడు. ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ విభేదించినా.. అది పూర్తిగా తన తమ్ముడి సొంత నిర్ణయం అని చెప్పాడు చిరంజీవి. ఇదిలా ఉంటే అప్పట్లో వైఎస్ జగన్ ను సతీసమేతంగా ఇంటికి వెళ్లి కలిశాడు చిరంజీవి.

ఆ సమయంలో జగన్ తో పాటు ఆయన భార్య భారతి సభను రిసీవ్ చేసుకున్న విధానం.. ఇంట్లో తమను సత్కరించిన విధానం.. ఆ ఆతిథ్యం ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను అంటున్నాడు చిరంజీవి. వైయస్ జగన్ తో తనకున్న సాన్నిహిత్యం ఈనాటిది కాదని సాక్షి పేపర్ మొదలుపెట్టినప్పుడు తాను కూడా వెళ్లాను అని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్న విషయం గుర్తు చేశాడు మెగాస్టార్. ఇప్పటికీ తమ కుటుంబాల మధ్య అదే సాన్నిహిత్యం కొనసాగుతుందని చెబుతున్నాడు చిరంజీవి. జగన్ పాలన అద్భుతంగా ఉందని ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన పిలిస్తే వైసీపీలోకి వెళ్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను.. ఎవరు మంచి చేసినా కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు.

More Related Stories