English   

బాగున్నారా అంటే వస్తావా అని అడిగేవారట 

 Ragini
2020-04-25 11:08:35

అమృతం లాంటి తెలుగు సీరియల్స్ లో నటించి పేరు సంపాదించింది నటి రాగిణి. ఈమె తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈమె సీరియళ్లలోనే కాక తెలుగులోని పలు పెద్ద హీరోల సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన జీవితానికి సంబంధించి పలు విషయాలు బయట పెట్టింది. సినీ పరిశ్రమలో మన క్యారెక్టర్ ని బట్టి మనని గౌరవిస్తారని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే తెలిసిన వాళ్లే కదా అని కొందరిని ఏంటి సార్ బాగున్నారా అడిగితే తన వైపు ఎగాదిగా చూసి వస్తావా అని అడిగిన రోజులు ఉన్నాయని, అందుకే బాగున్నారా అని అడగడం మానేశానని నమస్కారం సార్ అంటే మాత్రం ప్రతి నమస్కారం చేసి గౌరవిస్థారారని తెలిసి అలా చేసేదానినని చెప్పుకొచ్చింది. ఇక కుటుంబం గురించి చెబుతూ తాము మొత్తం 13 మంది సంతానమని అందులో తాను 12వ సంతానమని తెలిపింది. సినిమాలో నటిగా మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలని సినీ పరిశ్రమకు వచ్చానని కానీ అప్పట్లో హీరోయిన్ గా ఛాన్సులు వచ్చినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో అవకాశాలను చేజార్చుకున్నాని చెప్పుకొచ్చింది.

More Related Stories