మునుపెన్నడూ నటించని పాత్రలో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు.
ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాలో యంగ్ &స్టైలిష్ బిజినెస్‌మ్యాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. ఇంతకు ముందు నటించని పాత్రలో ఎన్టీఆర్ ను పరిచయం చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారని అంటున్నారు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ ఏమో ఆర్ఆర్ఆర్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. దానితో ఈ సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయచ్చని అంటున్నారు.