English   

స్టార్ నటుడు ఇంట తీవ్ర విషాదం..

irfan
2020-04-26 09:19:54

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సయీదా బేగం నిన్న మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెన్ నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే లాక్ డౌన్ కారణంగా తన తల్లిని చివరి చూపుకు కూడా ఇర్ఫాన్ ఖాన్ నోచుకోలేదని అంటున్నారు. దాంతో ఇర్ఫాన్ వీడియో కాల్ ద్వారా తన తల్లికి నివాళులు అర్పించారు. ఇక ఆమె వయస్సు 95 సంవత్సరాలు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీలో ఆమె నివసిస్తుంది. సహజ అనారోగ్య కారణాలతోనే సైదా బేగం కన్ను మూశారని అంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా తల్లి కడసారి చూపుల కోసం ఇర్ఫాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. సయీదాకు ముగ్గురు కుమారులు.. వారు.. ఇర్ఫాన్ , అతని సోదరులు సల్మాన్ , ఇమ్రాన్ లు.. ఇర్ఫాన్ సోదరుల్లో ఒకరు. నిజానికి మొన్నటి వరకు అరుదైన వ్యాధితో పోరాడి ఈ మధ్యే ఇండియాకు వచ్చాడు ఇర్ఫాన్‌ ఖాన్‌. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే తన తల్లిని పోగొట్టుకున్నారు ఆయన.  

 

More Related Stories