పుష్పలో సేతుపతి పాత్ర కోసం మరో తమిళ నటుడు...కానీ ?

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పుష్ప అనే పేరు అలాగే సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నీ మొన్న బన్నీ పుట్టిన రోజున రిలీజ్ కూడా చేశారు. ఇక ఈ పోస్టర్స్ ప్రేక్షకులలో ఒక రకమైన అంచనా పెంచేశాయి. ఈ సినిమా బన్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు ప్రముఖులని ఎంపిక చేశారు. విలన్స్ విషయంలో పలు ప్రచారాలు జరుగుతున్నా ఒక విషయం అయితే క్లియర్ అదే ఈ సినిమాలో ఒక కీలక పోలీసాఫీసర్ పాత్ర కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు.
అయితే ఆయన ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇందులో వివాదాలు లాంటివి అయితే ఏవీ లేవని కేవలం డేట్లు సర్దుబాటు కాకనే ఆయన తప్పుకున్నాడని అంటున్నా ఆ విషయం మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు ఆయన స్థానంలో అరవింద స్వామి, బాబీ సింహా పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్టు మొన్ననే ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం సుకుమార్ బాబీ సింహాతో చర్చలు జరిపారట. ఇక కథ విన్న బాబీ సింహాకు పాత్ర నచ్చిందని అయితే కాల్షీట్స్ సమస్య దృష్ట్యా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మరి ఆయన ఓకే చేస్తారో లేక కాల్ షీట్స్ సమస్య వలన తప్పుకుంటారో చూడాలి. ఈ విషయం మీద యూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా థామస్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.