English   

సూర్యకి షాకిచ్చిన థియేటర్స్ యాజమాన్యాలు...ఇక ప్రదర్శించరట !

suriya
2020-04-26 10:15:07

కరోనా ఇప్పుడు సినిమా వాళ్ళకి కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉండడంతో థియేటర్స్ ఏవీ తెరుచుకుంటే అవకాశం లేదు. ఈ లాక్ డౌన్ ఎత్తేశాక కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో కొందరు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సూర్య సినిమాలు చిక్కుల్లోపడ్డాయి. ఆయన ఇక మీద నిర్మించే సినిమాల్ని థియేటర్‌లో విడుదల చేయమని థియేటర్‌ యజమానులు స్పష్టం చేసాయి. దానికి కారణం ఆయన భార్య జ్యోతిక నటించిన సినిమా 'పోన్ మగల్ వందల్‌'. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యనే ఈ సినిమాని నిర్మించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడం లేదని, మే మొదటి వారంలో నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నామని ఈ మధ్య మేర్కర్స్ ప్రకటించారు.

ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో తమిళనాడు థియేటర్‌ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యామని, ఎప్పుడైనా సరే సినిమాను ముందు థియేటర్‌లో విడుదల చేయాలి, ఆపై మిగిలిన ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులోకి తీసుకురావాలని వారు పేర్కొన్నారు. మేం నిర్మాతల్ని కలిసి మాట్లాడామని, ఈ నిర్ణయాన్ని మార్చుకోమని కోరామని వాళ్ళు మా మాట వినలేదని అందుకే.. భవిష్యత్తులో వారి బ్యానర్‌పై తీసే ఏ సినిమాను కూడా థియేటర్‌లో ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. మరి సూర్య ఈ డిమాండ్ కి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

 

More Related Stories