English   

కోట్లతో కీర్తి టెంప్ట్ అవుతుందా ?

suresh
2020-04-26 11:07:42

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకొని ఒక్కసారిగా సినీ ప్రేమికుల దృష్టిని తన వైపు తిప్పుకుంది కీర్తి సురేష్‌. ప్రస్తుతం దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ మైదాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే మహానటి సినిమాలో కీర్తిని కాదని మరెవరిని నటింపచేసినా అక్కడ సావిత్రిలా సెట్ అయ్యేది కాదని చాలా మంది అన్నారు. అయితే ఏమనుకుందో ఏమో ఈ సినిమా తర్వాత ఇలా నిజ జీవిత పత్రాలు ఒస్తే చేయనని చెప్పేసింది. అందుకే ఎన్టీఆర్ కథానాయకుడులో సావిత్రిగా నటించే అవకాశం వచ్చినా కీర్తి సురేష్ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించింది.

ఈ సమయంలో దివంగత విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారని కీర్తి సురేష్ ని ఆమె పాత్రకు తెసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరిగింది. తన తల్లి పాత్రకు కీర్తి అయితేనే న్యాయం చేయగలుగుతుందని నరేష్ నమ్ముతున్నారని అన్నారు. విజయ నిర్మల లాంటి గొప్ప నటి, దర్శకురాలి బయోపిక్ లో నటించడమంటే కీర్తి సురేష్ కి మరింత క్రేజ్ సంపాదించడం ఖాయం. అయితే ఆమె ఇంతకు ముందు బయోపిక్స్ చేయనని చెప్పడంతో ఇప్పుడు ఈ సినిమా ఆమె ఒప్పుకుంటే ఎన్ని కోట్లు ఇవ్వటానికి అయినా రెడీ అవుతున్నారట మేకర్స్. మరి కీర్తి సురేష్ ఎన్ని కోట్లకు టెంప్ట్ అయి ఓకే చెబుతుందో చూడాలి.

 

More Related Stories