English   

పెళ్ళికి వెళ్తే అసహ్యించుకుంది..తగిన శాస్తే జరిగింది !

shakeela
2020-04-26 11:29:22

షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటేనే కేరళలో పెద్ద హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్ ఆపేసుకుని వెనక్కి వెళ్ళే వారు. ఆమె సినిమాలకు అంత డిమాండ్ ఉంది మరి కనీ గత పదేళ్లుగా ఆమె అస్సలు సినిమాలు చేయడం లేదు. అయితే సొంత కుటుంబ సభ్యులే మోసం చేయడం వల్ల సంపాదించినదంతా చాలా వరకూ పోగొట్టుకున్నట్లు షకీలా చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది. ఇప్పుడు కూడా ఒకటీ అరా క్యారెక్టర్స్ చేస్తున్నా ఇప్పటికీ బయటకు వెళితే సొంత కుటుంబ సభ్యుల వళ్లే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకోస్తోంది. అయితే ఆమె సొంత అన్న పెళ్ళికి వెళ్తే తన వదిన తనను చూసి రూమ్ లోకి వెళ్లిపోయి కొద్దీ సేపటివరకు బయటకు రాలేదని ఆమె తెలిపింది. పెళ్లి అయిన తరువాత విష్ చేయడానికి వెళితే.. ఆమె కుటుంబ సభ్యులు ఆమె వద్దకు వెళ్లవద్దని అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే అయితే కొంత కాలం తరువాత మీ అన్నయ్య నన్ను మోసం చేశాడని, నిన్ను అవమానించినందుకు తనకి తగిన శాస్తి జరిగిందని ఆమె తనకు ఫోన్ చేసినట్లు షకీలా చెప్పుకొచ్చింది.

 

More Related Stories