English   

ఇక నో ముంబై...హైదరాబాద్ లోనే ఫైటర్ షూటింగ్

vijay
2020-04-26 11:39:54

కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ అయిపోయాయి. ఇక మన ఇండియన్ సినిమాల షూటింగులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా వాళ్లందరూ దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న‘ఫైటర్’ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. నిజానికి గత కొద్దికాలంగా ఫైటర్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే కరోనా వల్ల ఈ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరారు. ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఫైటర్ తరువాత షెడ్యూల్ కూడా ముంబై లో జరగాల్సి ఉంది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా ఎఫెక్ట్ మహారాష్ట్ర లో ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ సమయం తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్ లో ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్ నే మళ్ళీ రూపొందించి షూటింగ్ జరపనున్నరని సమాచారం. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.  

 

More Related Stories