English   

ఎట్టకేలకి విజయ్ సాయం..కానీ విభిన్నంగా

vijay
2020-04-26 15:56:41

విజయ్ దేవరకొండ ఎట్టకేలకి బయటకు వచ్చాడు. ఇప్పటికే అందరు హీరోలు తమ తమ బాధ్యతగా కరోనా విరాళాలు ప్రకటిస్తున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ రూపాయి కూడా ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ మధ్య మీడియా ముందుకొచ్చినా తన తరపున ఎటువంటి సాయం ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఎంతో కొంత ఇస్తుంటే నీకమయింది అంటూ మనోదిని ఒక రేంజ్ లో ఆడుకున్నారు. దీంతో  కరోనా పై పోరాటంలో ఏకంగా రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో సామాన్యులకు సాయం అందించడానికి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి తన దైన ముద్ర వేసుకున్నాడు విజయ్.

ఏది చేసినా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్న విజయ్ కరోనా సంక్షోభంతో దుర్భర పరస్థితులును ఎదుర్కొంటున్న మిడిల్ క్లాస్ వారికి అందించడానికి ముందుకొచ్చాడు. దీని కోసం రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేసాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం రూ. 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసాడు. అలాగే యూత్‌కు ఎంప్లాయిమెంట్ కోసం ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇక మిడిల్ క్లాస్ వారికి ఎవరికైనా నిత్యావసరలు లేక అవస్థలు పడుతున్న వారి కోసం https://thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేసుకుంటే వాళ్ల వాలంటీర్లే స్వయంగా సభ్యులకు నిత్యావసరాలు అందిస్తారట. దాదాపు 2 వేల కుటుంబాలకు సంబంధించిన అవసరాలను ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. అయితే ఇది దానం ఏ మాత్రం కాదని సాయం అని అంటున్నాడు విజయ్.

 

More Related Stories