English   

పని మొదలెట్టిన లారెన్స్..నేరుగా అకౌంట్స్ లోనే సాయం

raghava
2020-04-26 16:08:44

కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో, దర్శకుడుగా సెటిల్ అయిన రాఘవ లారెన్స్ సాయం కోసం ఎదురు చూసే వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తన జీవితంలో ఎంతో మందికి సాయ పడిన ఆయన కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులు, పేదలు, సినీ నృత్యకళాకారులను ఆదుకోవడానికి ఇప్పటికే రూ.3 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. ఆయన ప్రకటించిన 3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు 50 లక్షల చప్పున అలాగే దివ్యాంగులకు 25 లక్షలు, తన స్వస్థలం రోయపురంలోని పేద ప్రజల కోసం 75 లక్షల సాయం అందజేస్తున్నట్టు లారెన్స్ స్పష్టం చేశారు.

ఇక లారెన్స్ ప్రకటించిన మొత్తాన్ని ఇప్పుడు పేదలకి పంచుతున్నారు. తాజాగా ఆయన టీమ్ పేద, దివ్యాంగ నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక్కొక్కరికీ రూ. 25,000 చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ నేరుగా వారి అకౌంట్లలో వేశారు. దివ్యాంగులైన డ్యాన్సర్లను లారెన్స్ మొదటి నుంచీ ప్రోత్సహిస్తోన్నారు. తన ప్రతి సినిమాలో ఒక పాటలో కచ్చితంగా దివ్యాంగ డ్యాన్సర్లను పెడుతుంటారు ఆయన.  

 

More Related Stories