English   

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న తమన్నా..

tam
2020-04-27 06:59:29

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజయం కోసం దాదాపు మూడేళ్ల పాటు వేచి చూసింది తమన్నా. చివరికి ఆమె కోరిక తీరి గతేడాది ఎఫ్2 సినిమాతో అందుకుంది. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ తర్వాత సైరా లాంటి భారీ సినిమాలో నటించే అవకాశం కూడా అందుకుంది. ఇప్పటికీ కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. హీరోలు కూడా తమన్నా వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీ మార్ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది తమన్నా. ఈ చిత్రం కోసం తెలంగాణ యాస నేర్చుకుంటుంది కూడా. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి త్వరలోనే ఎఫ్ 3 తెరకెక్కించబోతున్నాడు. ఇందులో కూడా తమన్నా ఉండబోతుంది. ఎఫ్2 సినిమాలో పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టాల గురించి.. లాభాల గురించి బేరీజు వేసి మరీ చెప్పాడు.

ఇందులో మాత్రం పెళ్లి టాపిక్ కాకుండా మరోటి ఉంటుందని.. కానీ కామెడీకి మాత్రం లోటు ఉండదని చెబుతున్నాడు అనిల్ రావిపూడి. ఇలాంటి సమయంలో తమన్నా ఓ తీపికబురు చెప్పబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. నిజానికి రెండేళ్లుగా తమన్నా పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. కానీ సినిమాలపై కాన్సన్ట్రేషన్ పెట్టడంతో మిల్కీ బ్యూటీ మ్యారేజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్న తమన్నా.. అవి పూర్తైన తర్వాత తన జతగాడి కోసం చూస్తానంటుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. అన్నీ కుదిర్తే 2021లో తమన్నా ఓ ఇంటిది అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories