English   

ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ అగ్ర దర్శకుడు వెయిటింగ్..

ntr
2020-04-27 07:52:41

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. దాంతో పాటు ఎన్టీఆర్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ లైన్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత బాలీవుడ్ వైపు జూనియర్ అడుగులు పడనున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ తారక్ కోసం ఓ అగ్ర దర్శకుడు వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. సంజయ్ లీలా భన్సాలి. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈయన బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ను లాంఛ్ చేయాలని చూస్తున్నాడు. ఎలాగూ రాజమౌళి సినిమా తర్వాత మనోడి పేరు బాలీవుడ్ లో మార్మోగిపోవడం ఖాయం.

దాంతో అదే క్రేజ్ తన సినిమా కోసం వాడుకోవాలని చూస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. నిజానికి ఎప్పటి నుంచో ఈయనతో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ దర్శకుడు.. కానీ కుదర్లేదు. ఇప్పటికి భన్సాలీ వైపు తారక్ కూడా చూస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ విలన్ గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పద్మావత్ లో అల్లాద్దీన్ ఖిల్జీగా చంపేసాడు రణ్వీర్. అదే నమ్మకంతో మరోసారి ఈ హీరోను విలన్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి నిజంగానే భన్సాలీతో తారక్ సినిమా వర్కవుట్ అయితే మాత్రం బాలీవుడ్ లో జూనియర్ దున్నేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

More Related Stories