English   

మద్యంపై మరోసారి మోడీ సర్కార్‌కు వర్మ సెటైర్..

rgvvsmodi
2020-04-27 08:08:36

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేసినా కూడా అది సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే కూర్చుని ప్రభుత్వానికి అప్పుడప్పుడూ మంచి సలహాలతో పాటు మరికొన్నిసార్లు సెటైర్లు కూడా వేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఈయన మద్యంపై చేసిన ట్వీట్ కు కేటీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. దానికి ముందు దీపాన్ని వెలిగించండని మోదీ చెప్తే సిగరెట్ వెలిగించాడు వర్మ. ఇప్పుడు మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. ఈయన మద్యంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతుందిప్పుడు. మద్యం మార్కెట్ లో లేకపోతే బ్లాక్ మార్కెట్ లో జరిగే అనర్ధాలపై ఈయన ట్వీట్ చేశాడు. ప్రజలు అమితంగా కోరుకునే వాటిపై పరిమితులు విధిస్తే.. దాన్ని సొమ్ము చేసుకోడానికి కొందరు బ్లాక్ చేస్తున్నారు.. దాంతో బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోతుంది. దీని వల్ల మందుబాబులు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దాంతో ప్రజలు కుటుంబ అవసరాలను కోల్పోవాల్సి వస్తోందని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు.

వర్మ చెప్పింది బాగానే ఉన్నా కూడా మద్యంపై చెప్పాడు కాబట్టి అది ఇప్పుడు అంత అవసరమా అంటున్నారు. కరోనా ఉదృతి కారణంగా ప్రభుత్వం దాదాపు నిత్యవసరాలకు మినహాయింపులు ఇచ్చింది. ఇతర వనరులై లాక్‌డౌన్ కొనసాగుతుంది. అందులో మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. మద్యం షాపులు మూతపడటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రభుత్వాలకు కూడా భారీగానే ఆదాయానికి గండి పడుతుంది. అయినా కూడా దీనిపై ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది. కేవలం లిక్కర్ ద్వారానే కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్న కొన్ని ప్రభుత్వాలు కూడా కనికరించడం లేదు. మహారాష్ట్రలో మాత్రం పరిమితులతో కూడిన మద్యం షాపులను తెరవాలనే డిమాండ్ వినిపిస్తుంది. మొత్తానికి ఈయన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

More Related Stories