English   

విజయ్ దేవరకొండతో కొరటాల సినిమా కన్ఫర్మ్.. సాక్ష్యం ఇదే..

vijay
2020-04-27 08:15:35

కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కోసం మరింత మంది స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. ఈయన మాత్రం తన దగ్గరున్న కథలు పూర్తైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని చెప్పాడు. అందులో ఎంతమంది కోసం కథలున్నాయనేది మాత్రం కన్ఫ్యూజనే. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండతో కొరటాల శివ సినిమా చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. గతంలోనూ ఓ సినిమా ఆడియో వేడుకలో ఇదే విషయం చెప్పాడు కొరటాల. తాను కచ్చితంగా విజయ్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు అనౌన్స్ చేసాడు శివ కొరటాల. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ కట్టడి కోసం స్టార్స్ చేస్తున్న సాయంలో విజయ్ దేవరకొండ కూడా ముందుకొచ్చాడు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాడు ఈయన. లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడే కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని విజయ్ దేవరకొండ భారీ సాయం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ ప్రకటన చేసిన కొంచెం సేపటికి ఆయనకు అండగా ఉంటామని టాలీవుడ్ నుంచి చాలా మంది ముందుకొచ్చారు.

అందులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నాడు. ఇక ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా లక్ష రూపాయలు దేవరకొండ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చాడు. దాంతో 100 కుటుంబాలు బతుకుతాయని విజయ్ థ్యాంక్స్ డార్లింగ్ అని రిప్లై ఇచ్చాడు కూడా. విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్)కు కార్తికేయతో పాటు మరికొందరు కూడా సాయం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ కూడా ఓ ట్వీట్ లో నీకు నేనున్నాను బ్రదర్ అంటూ ట్వీట్ చేసాడు. 'లవ్ యూ బ్రదర్, పది మందికి తోడుగా ఉండే పనుల్లో నీకు తోడుగా నేనుంటాను. కుమ్మేద్దాం. మంచితో. త్వరలో కలుద్దాం' అని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. మొత్తానికి ఈయన తీరు చూస్తుంటే కచ్చితంగా విజయ్ దేవరకొండతోనే తర్వాత సినిమా చేస్తాడేమో అనిపిస్తుంది.

More Related Stories